అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
267

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
    మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు...
By Benguluri Madhubabu 2026-07-10 13:52:04 0 91
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 186
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
    వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-15 09:49:55 0 156
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 109
SURAKSHA
N. Prasanth IAS: Inspiring Governance Through Innovation
The Journey Begins "Technology should make governance simpler, faster, and...
By Fathima Safa 2026-07-14 07:54:15 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com