తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

0
355

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ భవనాల్లో కొనసాగాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్‌ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది.

 

2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పని చేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది.

 

డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ అవ్వాలని.. అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని.. ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది.

Search
Categories
Read More
BMA
Muted First Views: Protecting Fact-Checkers from Trauma
Indian fact-checking organizations are establishing vital protocols to mitigate psychological...
By JoinBMA 2026-08-21 11:33:13 0 347
Rajasthan
Rajasthan Strengthens Wildlife and Environmental Protection
Rajasthan continues to strengthen wildlife conservation and environmental protection through...
By Fathima Safa 2026-06-30 12:01:44 0 156
Andhra Pradesh
పోలియో రైటర్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం జవ్వాది
*పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది*   *చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*...
By Rajini Kumari 2025-12-21 08:38:58 0 226
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదాలపై అవగాహన
పుంగునూరు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో...
By Kothuru Murali 2026-04-17 08:02:20 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com