యువజన ఉత్సవాల ముగింపులో బహుమతులు ప్రధానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0
206

పత్రికా ప్రకటన.

 

గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025

 

*వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* 

 

*యువజన ఉత్సవాల ముగింపులో బహుమతుల ప్రదానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి* 

 

 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర యువ సంకల్ప్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదేనని అన్నారు.

స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని సూచించారు. యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ, మంచి పనులు చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.

రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేక రాష్ట్రం ఎంతో బాధను అనుభవించిందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనమని, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనుందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి, కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్
మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్ మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు...
By Chennaiah Kati 2026-06-30 09:13:23 0 104
Andhra Pradesh
అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై...
By Pagadala Venkateswar 2026-05-14 05:48:00 0 120
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 238
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 542
Telangana
నిజామాబాద్: డప్పు వాయీద్యలు, డయాన్స్ థో ప్రచారం
నిజామాబాద్‌ మున్సిపాల్‌ కర్పోరేషన్‌ ఎనికాల నీపద్యంలో సీపీఎం 35వ దివిజన్ అభ్యర్ధి...
By Sadaq Sadaq 2026-02-08 13:01:43 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com