పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

0
273

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 19, 2025*

 

*ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయండి*

- *కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వ‌హించే ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో 100 శాతం విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. 

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లా టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్‌ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్ల‌లోపు పిల్లలు ల‌క్ష్యంగా ప‌ల్స్ పోలియో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని.. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్, ప్ర‌జా ర‌వాణా, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు. 611 గ్రామీణ బూత్‌లు, 355 అర్బ‌న్ బూత్‌లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్ర‌త్యేక బృందాలు సేవ‌లందిస్తాయ‌న్నారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు. ఆశా కార్య‌క‌ర్త‌లు, ఏఎన్ఎంలు క్షేత్ర‌స్థాయిలో అంగ‌న్‌వాడీ కేంద్రాల సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేసేలా అధికారులు చూడాల‌న్నారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంపై ఇప్ప‌టి నుంచే వివిధ మార్గాల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాల‌ను గుర్తించాల‌ని సూచించారు. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు త‌దిత‌ర చోట్ల కూడా పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. సూప‌ర్వైజ‌రీ అధికారులు కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో విజ‌య‌వంతమ‌య్యేలా చూడాల‌ని ఏ ఒక్క‌రూ మిగిలిపోకుండా ఇమ్యున‌జైషేన్ జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. స‌మావేశంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డా. సునీల్‌, డా. జె.సుమ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
అందరికీ సకల శుభాలు కలగాలి మంత్రి ఆనం
*తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి ఆనం*   *అందరికీ సకల శుభాలు...
By Rajini Kumari 2026-01-13 16:10:29 0 239
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 284
SURAKSHA
Dr. Shakil P. Ahammed, IAS: A Legacy of Visionary Governance
A distinguished 1995-batch IAS officer whose administrative excellence, strategic leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-22 11:03:47 0 132
Telangana
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.
చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908...
By Nookapangu Manikanta 2026-05-18 11:44:46 0 316
Andhra Pradesh
వేటపాలెం మండలం నందు Gender Resource Centre ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య.
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ...
By Gadiyapudi Narendra 2026-02-18 16:03:15 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com