డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం

0
31

*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*

 

*పోలియో డే ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన...ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వరల కుమార్ రాజా*

 

*అవగాహన లేమితో చేసే చిన్న పొరపాటు.... పసిపిల్లల జీవితానికి శాపం కావొద్దు: ఎమ్మెల్యేలు*

 

*100% చిన్నారులకు చుక్కలు వేయించి.... పోలియోపై మరోసారి విజయం సాధిద్దాం: ఎమ్మెల్యేలు*

 

గుడివాడ డిసెంబర్ 18: ఈనెల 21వ తేదీన జరిగే పోలియో డేను అందరం కలిసి విజయవంతం చేద్దామని గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అవగాహన లేమితో చేసే చిన్న పొరపాట్లు పసి పిల్లల జీవితానికి శాపం కాకూడదని ఎమ్మెల్యేలు అన్నారు.

 

గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో.... పోలియో డే ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా ఆవిష్కరించారు. పోలియో డే విజయ వంతానికి చేస్తున్న ఏర్పాట్లను వైద్య అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజాలు మీడియాతో మాట్లాడారు..... గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలందరూ పోలియో డే సందర్భంగా ఈనెల 21వ తేదీన తమ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పోలియో బూత్ లలో ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు.

 

పోలియోపై నిరంతర విజయం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. అధికారులతో పాటుగా, కూటమి శ్రేణులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకునేలా కృషి చేయాలన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్,మెడికల్ ఆఫీసర్ సురేష్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు చాట్ల రమేష్, మున్సిపల్ ఎంఈ ప్రసాద్, డాక్టర్ శ్వేత,ఎంవి ప్రసాద్,రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వై.నాగేశ్వరరావు, కార్యదర్శి కిరణ్ బాబు,ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Manipur
Imphal East Security Forces Arrest Insurgent, Recover Weapons |
Security forces in Imphal East district arrested an active insurgent and his associates during...
By Pooja Patil 2025-09-16 06:55:29 0 85
Andhra Pradesh
అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే
*తెలుగు రాష్ట్రాల  అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*...
By Rajini Kumari 2025-12-13 08:53:05 0 117
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com