శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|

0
41

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక మంగళవారం సూరారం కాలనీ లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం భవనంలో జరిగింది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాత కార్యవర్గాన్నే కొనసాగిస్తూ అనారోగ్యంతో సంఘ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనలేక పోతున్న సభ్యుల స్థానంలో సంఘకార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న సభ్యులకు కార్యవర్గంలో స్థానం కల్పించినట్టు గోగులపాటి కృష్ణమోహన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంఘ పఠిష్ఠత, విస్తరణ కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా గోగులపాటి కృష్ణమోహన్, ప్రధాన సలహా దారునిగా సర్వేపల్లి రమేష్ కుమార్, గౌరవ సలహా దారులుగా రామదాసు పరశురామ శర్మ, హనుమంతరాయ శర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీరామశర్మ చక్రధారి, గడ్డం రాంబాబు, ప్రధానకార్యదర్శిగా నిట్టల వెంకట వీరభద్ర సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులుగా పురోహితుల హరిరాఘవేంద్ర శర్మ, సింహాచలం శ్రీధరాచార్యులు, ప్రచార కార్యదర్శులుగా రాచపూడి ప్రభాకర్ శర్మ, కోడూరి జగదీష్ శర్మ, కోశాధికారిగా రుద్రావర్జుల సంజీవరావు, ప్రాంతీయ కార్యదర్శులుగా వెంకటేశం గారి రాధాకృష్ణ, రామడుగు రామకృష్ణ శాస్త్రి, అచ్యుతుని ఫణీంద్ర, కనుపర్తి సాయిరాం, కార్యవర్గ సభ్యులుగా దుర్గా నాగమోహన్ ఆదూరి, శివభాస్కర్, గీర్లపల్లి సాయి భరత్ రామ్, చింతపట్ల వెంకటరమణాచార్యులు, మహిళా కార్యవర్గ సభ్యురాళ్ళుగా నండూరి మాలతి, రుద్రావజ్ఞుల సుబ్బలక్ష్మి, సింహాచలం గీత, గడ్డం రుచిత, పుట్రేవు హైమ, రాచపూడి శ్రావణి, బండి సూర్య సుందరి, గంటి సునీతలను ఏకగ్రీవంగా ఎన్నికచేసినట్లు తెలిపారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 44
Tripura
“ত্রিপুৰা: ২১ কৃষি বজাৰ ডিজিটেল, কৃষকৰ আয় বঢ়াবলৈ”
ত্রিপুৰা চৰকাৰে ২১টা #AgricultureMarket ক #eNAMৰ অধীনত ডিজিটেল মাৰ্কেটলৈ পৰিণত কৰাৰ সিদ্ধান্ত...
By Pooja Patil 2025-09-12 05:23:49 0 114
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com