ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :

0
149

కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...

నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఆదివారం ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో, రహదారుల ఇరువైపులా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని, ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులచే డ్రైవ్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఏకకాలంలో ఖాళీ స్థలాల శుభ్రతకు ఒకేసారి ప్రత్యేకంగా 27 జెసిబిలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

విస్తరిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాల సమస్య అధికంగా ఉండటం వల్ల ఆ డివిజన్లకు అధిక సంఖ్యలో జెసిబిలను కేటాయించడం జరిగిందని, ఇప్పటికే పారిశుద్ధ్య సిబ్బంది అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులకు కొన్ని రోజులుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, నగరపాలక సంస్థ అధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపునకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జన నివాసాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో పాములు, తేళ్ల నుంచి ప్రజలకు ముప్పు ఏర్పడటంతో పాటు, దోమలు, పందుల ఆవాసాల కారణంగా ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులకు విధించే జరిమానాను చెల్లించిన తర్వాతనే ఆయా స్థలాలకు వీఎల్‌టీ, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాల సమస్యకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్థానిక శానిటేషన్ కార్యదర్శి, ఇన్‌స్పెక్టర్లను సంప్రదించాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.

సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 2K
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి...
By Sidhu Maroju 2025-06-04 17:53:37 0 1K
Telangana
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
      Medchal malkajgiri. Dist.  Alwal. On auccation of Chintala Manikya...
By Sidhu Maroju 2025-12-04 08:56:05 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com