ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :

0
333

కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...

నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఆదివారం ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో, రహదారుల ఇరువైపులా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని, ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులచే డ్రైవ్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఏకకాలంలో ఖాళీ స్థలాల శుభ్రతకు ఒకేసారి ప్రత్యేకంగా 27 జెసిబిలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

విస్తరిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాల సమస్య అధికంగా ఉండటం వల్ల ఆ డివిజన్లకు అధిక సంఖ్యలో జెసిబిలను కేటాయించడం జరిగిందని, ఇప్పటికే పారిశుద్ధ్య సిబ్బంది అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులకు కొన్ని రోజులుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, నగరపాలక సంస్థ అధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపునకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జన నివాసాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో పాములు, తేళ్ల నుంచి ప్రజలకు ముప్పు ఏర్పడటంతో పాటు, దోమలు, పందుల ఆవాసాల కారణంగా ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులకు విధించే జరిమానాను చెల్లించిన తర్వాతనే ఆయా స్థలాలకు వీఎల్‌టీ, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాల సమస్యకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్థానిక శానిటేషన్ కార్యదర్శి, ఇన్‌స్పెక్టర్లను సంప్రదించాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.

సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 50
Telangana
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11 వ డివిజన్ లో చలివేంద్ర ని ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
 మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ...
By Avunoori Mahesh 2026-04-26 13:03:22 0 172
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 361
Andhra Pradesh
చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ...
By Mobbu Venkatramana 2026-02-28 11:48:51 0 290
Andhra Pradesh
నగరాల వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ
నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టి నగర్ శ్రీ నగరాల...
By Rajini Kumari 2026-01-02 12:33:13 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com