ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి

1
266

 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి..

 

రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి ఘూట్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అయితే 9 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. 20 మందికిపైగా తీవ్రంగా  గాయపడ్డారు

బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తెల్లవారుజాము నాలుగున్నర ప్రాంతంలో ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి బస్తీ బోల్తా పడింది. విజువల్స్‌ చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడి కనిపిస్తోంది. చాలామంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారు. ఒకరిపై ఒకరు పడడంతోపాటు.. బస్సు బరువు కూడా ప్రమాదానికి కారణంగా మారింది. ఇక క్షతగాత్రులను చింతూరు CHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు లో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రమాదంలో గాయపడిన 21 మంది చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటున్న వైద్యులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని భద్రాచలం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 8 అంబులెన్స్‌లలో గాయపడ్డ వారిని చింతూరుకి తరలించారు. ప్రమాదసమయంలో డ్రైవర్లతో కలిపి బస్సులో 36 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదఘటన జరిగిన తర్వాత చాలా సేపు వారికి సహాయకచర్యలు అందలేదని తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు తోడయ్యాయి. ప్రమాద స్థలం దట్టమైన అడవి కావడంతో భారీగా చలి కూడా ఉంది. దీంతో క్షతగాత్రులు వణికిపోయారు. దాదాపు గంటా, గంటన్నర తర్వాతగాని సహాయకచర్యలు అందలేదు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 అంబులెన్స్ కూడా సమాచారం ఆలస్యంగా అయినట్లు తెలుస్తోంది.

దట్టమైన పొగమంచుతో దారి కనిపించకే ప్రమాదమా..?

దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్‌ బస్సును కంట్రోల్‌ చేయలేకపోయారని, ఘాట్‌రోడ్డులో జర్నీ డ్రైవర్‌కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఘాట్‌రోడ్డు ప్రమాదంలో మృతులంతా చిత్తురు, బెంగళూరు వాళ్లేనని తెలుస్తోంది. శ్రీకూర్మం నుంచి భద్రాచలం వరకూ పుణ్యక్షేత్రాలు కవర్‌ చేసేలా.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో టూర్‌కి 36 మంది బయలుదేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అరకు నుంచి భద్రాచలం వస్తుంటే ప్రమాదం జరిగింది. బస్సులో బెంగుళూరు వాళ్లు 12 మంది, చిత్తూరు వాళ్లు 24 మంది ఉన్నట్లు తెలుస్తోంది. #sivanagendra

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com