పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి బాలింత మృతి

0
105

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ బాలింత మృతి పై ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గూడూరు మండలంలోని పెంచికలపాడు విశ్వ భారతి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. సంఘటనకు సంబంధించి సి. బెళగల్ మండలంలోని కె సింగవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని రెండేళ్ల కిందట కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. వెంకటలక్ష్మికి తొలి ప్రసవం కావడంతో పుట్టినిల్లు అయిన కె లింగవరం గ్రామానికి రావడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రసాదం కొరకు పెంచికలపాడు లోని విశ్వ భారతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి చేర్పించారు. గురువారం వైద్యులు వెంకటలక్ష్మికి సిజేరియన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత వెంకటలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు మరో మారు ఆపరేషన్ నిర్వహించగా కోలుకోలేక మృతి చెందింది. తమ బిడ్డకు వైద్యులు సరైన వైద్యం చేయకపోవడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు కుటుంబ సభ్యులకు దిగారు. వెంకటలక్ష్మి మృతిచెందరం పట్ల వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఇబ్బందితో ఆసుపత్రికి చేరుకొని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 700
Telangana
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలో ని తమ తమ మండల ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలలోని స్లమ్స్ ఏరియాలను...
By Vadla Egonda 2025-07-25 01:41:33 0 990
Telangana
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
By Sidhu Maroju 2025-11-02 16:43:41 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com