లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|

0
422

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం నేరుగా ప్రజలకు చేరేలా ఎమ్మెల్యే  ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:

బాలాజీ యాదవ్ (అల్వాల్ డివిజన్) – రూ. 37,500

నవీన్ రాజు (అల్వాల్ డివిజన్) – రూ. 13,500

వాణి (వినాయక్ నగర్ డివిజన్) – రూ. 11,500

షేక్ జిలాని (మచ్చ బొల్లారం డివిజన్) – రూ. 21,000

ఎమ్మెల్యే  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో మందికి ఆశగా నిలుస్తోందని తెలిపారు. మరింత మంది లబ్ధిదారులకు కూడా ఈ సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమం లో  కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, నాయకులు డోలి రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-12 16:56:09 0 187
Andhra Pradesh
శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.
దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి...
By Pagadala Venkateswar 2026-05-06 07:32:59 0 128
Andhra Pradesh
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణపైYSRCP సమరభేరి
తాడేపల్లి   ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ సమరభేరి...  ...
By Rajini Kumari 2025-12-18 08:40:27 0 247
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com