ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.|

0
46

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  దుండిగల్  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా పరిధిలోని హోమ్ ఫర్ ది డిజేబుల్ & ఏజ్డ్, లిటిల్ సిస్టర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్, మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా హోమ్, కు చెందిన 40 మంది వయోధికులను అలాగే పేద విద్యార్థులను ఆనందపరచడానికి వారు ఊహించని విధంగా ప్రత్యేక కార్యక్రమం కోసం గురువారం దుండిగల్ లోని కదిలే విమాన హోటల్‌ (ఫ్లైట్ రెస్టారెంట్ మూవింగ్ హోటల్) కు తీసుకువెళ్ళి. వయోధికులు, పేదపిల్లలు ఆనందంగా పాల్గొనే విధంగా చిన్న చిన్న ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలు, పాటలు నిర్వహించారు. అనంతరం వయోధికులతో కేక్ కట్ చేయించి వారిని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాలు వృద్ధులలో మానసిక ఉల్లాసాన్ని పెంచడంతో పాటు సామాజిక పరిచయాలు పెరిగేందుకు సహాయపడ్డాయి. తదుపరి, వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకొని ఇష్టమైన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు మాట్లాడుతూ...ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సంతోషకరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత, ప్రతి వయోధికుడినీ క్షేమంగా, గౌరవంతో తిరిగి ఆయా వృద్ధాశ్రమాలకు చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో, అలాగే సంకల్ప ఆర్గనైజేషన్, వసుంధర డైమండ్స్ వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. వృద్ధుల ఆనందం, సంతోషభావం, వారి ముఖాలపై కనిపించిన చిరునవ్వులు ఈ కార్యక్రమానికి నిజమైన విజయపతాకాన్ని అందించాయి.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Haryana
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25 Chandigarh...
By BMA ADMIN 2025-05-22 11:43:50 0 2K
Telangana
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్ అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-07-29 10:51:37 0 715
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com