హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|

0
248

హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి… వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు.

మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని వారికి హిత‌వు ప‌లికారు. 

ఆదివారం అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్‌లో నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.

టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంత‌రం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Andhra Pradesh
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
By Boiena Rajesh 2026-03-07 09:42:32 0 251
Telangana
స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ...
By Avunoori Mahesh 2026-05-29 10:22:00 0 173
Andhra Pradesh
ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో...
By Santhosh Kumar 2026-09-13 10:08:05 0 142
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 09:24:08 0 193
Andhra Pradesh
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు...
By Gadiyapudi Narendra 2026-01-07 13:49:34 0 373
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com