జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కంటోన్మెంట్ నాయకుల సంబరాలు.!

0
51

సికింద్రాబాద్:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈరోజు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ ని ప్రత్యేకంగా అభినందించి, ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్పులతో హోరెత్తించి, మిఠాయిలు పంచుకున్నారు. సంబరాల అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాయకులు , కార్యకర్తల సహకారంతో అహోరాత్రులు శ్రమించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొని జూబ్లీహిల్స్ లో విజయం సాధించామని అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, అరవింద్ యాదవ్, గౌరీ శంకర్,బల్వంత్ రెడ్డి, నరేష్, మహేష్,సరిత, భవాని, ధనలక్ష్మి,ధనశ్రీ, గోమతి, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 184
Punjab
PDMA Warns of Possible Dengue Outbreak in Eastern Punjab |
The PDMA has warned of a potential dengue outbreak in eastern Punjab cities. Residents are...
By Pooja Patil 2025-09-16 05:22:54 0 75
Manipur
মণিপুরে একদিনের উপবাস ও প্রার্থনা শান্তি ও ন্যায়ের আহ্বান
১৩ সেপ্টেম্বর, #মণিপুরে একদিনের #উপবাস এবং প্রার্থনার আয়োজন করা হয়েছে। এই অনুষ্ঠানে...
By Pooja Patil 2025-09-13 06:36:00 0 80
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com