శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
75

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్ మందిరం వద్ద శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్  556వ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, గురుద్వారంలో గురు గ్రంథ్ సాహిబ్ కి నమస్కరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ —

“సర్వ మత సౌహార్దం, సేవాభావం, సమానత్వం వంటి విలువలను బోధించిన శ్రీ గురు నానక్ దేవ్ జీ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తాయి. గురు నానక్ జీ బోధనలు సమాజం అభివృద్ధికి మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు.

అల్వాల్ పరిధిలో గురుద్వార కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గురుద్వార సంగత్ సాహిబ్ సభ ప్రబంధక్ కమిటీ సభ్యులు జస్బీర్ సింగ్, అమన్‌దీప్ సింగ్, వర్జిందర్ సింగ్, కమిటీ సభ్యులు, అలాగే బీఆర్‌ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, శరణ గిరి, సురేష్, యాదగిరి, ప్రేమ్, అరుణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com