వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడులు.|

0
77

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్ పరిది లోని ఆదర్శ్ నగర్ వెంకటాపురం లో ఒక ఇంట్లో వ్యభిచారం  నడుపుతున్నట్లుగా నమ్మదగిన అందిన సమాచారం మేరకు అల్వాల్ పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడులు చేశారు. ఆ ఇంట్లో వ్యభిచారం నడుపుతున్న గడ్డం కృష్ణమూర్తి, వయస్సు: 40 సంవత్సరాలు.  మరియు మరొక మహిళా నిర్వాహకురాలు, వయస్సు:29 సంవత్సరాలు, ఈ ఇరువురుని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి వివరాలు రాబట్టారు. వీరు అట్టి వ్యభిచార గృహాన్ని ఒక నెల రోజులుగా  నిర్వహిస్తున్నట్లుగా ఒప్పుకొన్నారు.

ఆ ఇంట్లో  30 సంవత్సరాల వయస్సు గల ఒక బాధితురాలుని పోలీసులు షెల్టర్ హౌస్ కి తరలించారు. మరియు విటుడు అయినటువంటి మల్లవల్లి రామకృష్ణ అను అతన్ని తదుపరి విచారణ నిమిత్తం తమ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు  అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిన వెంటనే పి.ఎస్. కు సమాచారం ఇవ్వాలని అల్వాల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com