ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనుల వల్ల ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
55

సికింద్రాబాద్: ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈరోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు . కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టిందని దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురి కావద్దని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాలంరాయి చౌరస్తా,అన్న నగర్ చౌరస్తా లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీని వల్ల స్థానిక బస్తీల వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే వాహనదారులతో కూడా స్వయంగా మాట్లాడి వారి సూచనలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 126
Telangana
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
By CM_ Krishna 2025-12-17 04:02:40 0 9
Assam
Thadou Tribe Protest in Assam Demands Action on Insurgents
Members of the Thadou tribe staged protests in #Guwahati after the brutal killing of their leader...
By Pooja Patil 2025-09-11 06:09:29 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com