నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |

0
39

సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన 3 వ వార్షికోత్సవానికి బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. బొడ్రాయి ప్రతిష్టించి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో మూడవ వసంతానికి కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు.బొడ్రాయి పండుగ సందర్భంగా హమాలి బస్తీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా వదిలిపోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన మూడవ సంవత్సరం ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని కెటిఆర్ అన్నారు. పల్లె ప్రాంతాలలో ఘనంగా నిర్వహించే బొడ్రాయి పండుగను పట్టణాలలో సైతం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలలో బి అర్ ఎస్ గెలిపించేలా బంధువులకు స్నేహితులకు చెప్పాలని కేటీఆర్ కోరారు.

Sidhumaroju 

Search
Categories
Read More
West Bengal
Salt Lake Gets New Power Control Room |
West Bengal Power Minister Aroop Biswas inaugurated a new 132 kV Gas Insulated (GI) substation...
By Bhuvaneswari Shanaga 2025-09-20 04:55:10 0 56
Arunachal Pradesh
Namchik-Namphuk Coal Lease Sparks Controversy |
Arunachal Pradesh has granted a 30-year lease for the Namchik-Namphuk coal mines to Coal Pulz Pvt...
By Pooja Patil 2025-09-15 06:18:54 0 64
Andhra Pradesh
ఇమామ్..మౌజాన్ ల గౌరవ వేతనంపై కూటమి సర్కార్
అరకొర కేటాయింపులతో దగ, ఇమామ్..మౌజాన్ ల గౌరవ వేతనంపై కూటమి సర్కార్ కుట్రలు వైసీపీ నాయకులు సయ్యద్...
By mahaboob basha 2025-06-29 15:28:33 0 1K
Telangana
రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్...
By Sidhu Maroju 2025-07-12 17:38:23 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com