గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |

0
116

సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోరక్ష దళ్ సభ్యుడు ప్రశాంత్ సింగ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్,ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ గోరక్ష చేస్తున్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరం అన్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వం పోలీసులు తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.జూబ్లీహిల్స్ ఎన్నికల ఓట్ల కోసమో, డబ్బుల కోసం ప్రశాంత్ సింగ్ ఇలా చేశారని జరుగుతున్న ప్రచారం సరికాదని అన్నారు.వెంటనే పోలీసులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ గోవులకు,గో రక్షకులకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోరక్షకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హేయమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందని,ప్రభుత్వం నిలబడుతుందా..కుప్పకూలుతుందా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.పోలీసులు ప్రభుత్వమే గో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందన్నారు.పోలీసుల నిర్వహించిన మీడియా సమావేశంలో గో అక్రమ రవాణా దారులకు కోటి రూపాయలు నష్టం వచ్చిందని చెప్పడం సిగ్గుచేటన్నారు.రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు దళారీగా మారి గోవధను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ నిర్వీర్యంగా మారిందనీ దుయ్యబట్టారు.తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కాల్పుల సంస్కృతి పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణం అన్నారు.

ఇటీవల నిజామాబాదులో కానిస్టేబుల్ ను హతమార్చడం, నిన్న గోరక్షకుడు ప్రశాంత సింగ్ పై జరిగిన దాడులే నిదర్శనమని తెలిపారు.

ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ...
By Rajini Kumari 2025-12-16 12:14:25 0 25
Bharat Aawaz
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
https://www.youtube.com/shorts/9sm80c24hM0
By Bharat Aawaz 2025-08-20 10:34:46 0 597
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com