అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

0
81

సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ వద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్పలు నిర్వహించే పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పాదయాత్ర గా శబరిమల కు వెళ్ళి అయ్యప్పస్వామి ని దర్శించుకోవడం జరుగుతుందని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి పాదయాత్ర బృందం సభ్యుడు వెంకటేష్ యాదవ్ జాదవ్ తెలిపారు. నవంబర్ 23 వ తేదీన శబరిమల కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఓదెల సత్యనారాయణ, హన్మంతరావు తదితరులు ఉన్నారు.

ꜱɪᴅʜᴜᴍᴀʀᴏᴊᴜ

Search
Categories
Read More
Punjab
PDMA Warns of Possible Dengue Outbreak in Eastern Punjab |
The PDMA has warned of a potential dengue outbreak in eastern Punjab cities. Residents are...
By Pooja Patil 2025-09-16 05:22:54 0 53
BMA
The Power of Alternative Media: A People’s Movement
The Power of Alternative Media: A People’s Movement From pamphlets during the freedom...
By Media Facts & History 2025-04-28 13:23:52 0 2K
Andhra Pradesh
హోం మంత్రి అనిత ఆదేశం: జిల్లాల్లో కంట్రోల్ రూములు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు |
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దృష్ట్యా, హోం మంత్రి వి. అనిత అధికారులను అప్రమత్తం చేశారు....
By Bhuvaneswari Shanaga 2025-09-26 10:08:15 0 47
Andhra Pradesh
NDA పాలనపై YSRCP ఆరోపణలు తీవ్రంగా
ఆంధ్రప్రదేశ్‌లో అధికార NDA ప్రభుత్వంపై ప్రతిపక్ష YSRCP తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ...
By Deepika Doku 2025-10-09 13:37:03 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com