ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి

0
143

మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రధాని మోడీ 50 లక్షలు సీఎం 50 లక్షలు డిప్యూటీ సీఎం 50 లక్షలు అర్జున్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

 కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంచార్జ్ అనంతరత్నమ్ మాదిగ డిమాండ

 

 కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నందు 16 తారీకు జరిగిన జిఎస్టి మహాసభలో విద్యుత్ శాకుకి గురై మరణించిన ఎం అర్జున్ భౌతిక కాయానికి ఈరోజు ఉదయం 11గంటలకు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇన్చార్జి అనంతరత్నమ్ మాదిగ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష జిల్లా ఓబీసీ చైర్మన్ సాంబశివుడు ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎం ఖాద్రి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనంతరత్నమ్ మాదిగ మాట్లాడుతూ 16వ తారీఖున కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిఎస్టి మహాసభలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి మోడీ మెప్పు కొరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లక్షల సంఖ్యలో జనాలను సభకు తోలడం జరిగింది ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్లకు సెలవులు ప్రకటించి స్కూళ్ల బస్సులను ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో గ్రామాలకు తరలించి గ్రామీణ ప్రాంత ప్రజలను సభకు తోలడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది మైనర్ బాల బాలికలు రావడం జరిగింది ఈ యొక్క క్రమంలో స్కూలు బంద్ అయినందువలన మునగపాడుకు చెందిన అర్జున్ టెన్త్ క్లాస్ విద్యార్థి కృప అమృత్ టెన్త్ క్లాస్ విద్యార్థి రాఘవ టెన్త్ క్లాస్ విద్యార్థి ఈ ముగ్గురు విద్యార్థులు సినిమా హీరో ఈనాటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సభకు వచ్చిన ఈ ముగ్గురు విద్యార్థులు కరెంటు షాక్ కి గురయ్యారు ఇందులో ఎం అర్జున్ మరణించడం జరిగింది . మిగతా ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు స్కూలు సెలవులు ప్రకటించకుండా ఉండుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కావున కూటం ప్రభుత్వం బాధ్యత వహించి మరణించిన కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఒక కోటి 50 లక్షలు గాయపడిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటి మీటింగ్లు జరుగుతే స్కూలుకు సెలవులు ప్రకటించకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని మాట్లాడారు ఇట్లు అభి వందనములతో  అనంతరత్నమ్ మాదిగ  కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

Search
Categories
Read More
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 47
Haryana
Arrested Across Three States for Allegedly Spying for Pakistan
Arrested Across Three States for Allegedly Spying for Pakistan New Delhi, – In the...
By BMA ADMIN 2025-05-22 05:41:33 0 2K
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్: గిరిజన గ్రామాలకు రోడ్లు – 'అడవి తల్లి బాట' పథకం ప్రారంభం
సరికొత్త పథకం: ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 'అడవి తల్లి...
By Triveni Yarragadda 2025-08-11 13:48:40 0 865
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com