శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|

0
244

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. వారితోపాటు ఎస్ డబ్ల్యూ మేనేజ్మెంట్ డిఇ. సత్యనారాయణ, ఏ.ఇ. సమీర్, ఎంటమాలజీ ఏఇ. అనిల్, ఎస్ ఎఫ్ ఏ వెంకట్రామిరెడ్డి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

స్థానిక కాలనీలో ప్రజలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, కార్పోరేటర్ చేసిన కృషిని అభినందించారు.

 

చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల దోమల ఉధృతి పెరిగి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

 

నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, మరియు పారిశుద్ధాన్ని కాపాడడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వేగవంతంగా పూర్తి చేసి చెరువును పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క రహితంగా తీర్చిదిద్దాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

 

దీనికి అధికారులు స్పందిస్తూ.. అవసరమైన యంత్రాలను మొహరించి వీలైనంత త్వరగా ప్రక్షాళన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి, సమీప కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
T. V. Anupama IAS: A Beacon of Courage and Compassion
The Journey Begins T. V. Anupama, IAS, a 2010-batch Indian Administrative...
By Fathima Safa 2026-07-14 12:40:59 0 136
Telangana
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు రిమాండ్.|
● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జ్ అరెస్ట్ ● ఘటనను...
By Sidhu Maroju 2026-08-12 06:00:57 0 125
Telangana
నిజామాబాద్: మార్కెట్ యార్డ్‌కు కారెంట్ కాట్
వ్యావసాయా మార్కెట్ యార్డ్‌కు విద్యోత్ సరాఫరాలాను నిలిపివేషారు. 6నెలాలుగా సుమరు రూ. 16 లక్షల...
By Sadaq Sadaq 2026-05-03 10:43:35 0 170
Andhra Pradesh
మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి...
By Pagadala Venkateswar 2026-04-07 03:50:59 0 174
Telangana
పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత...
By Gujile Ramu 2026-04-29 14:51:55 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com