గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.

0
62

సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎస్టీఎఫ్‌ ‌సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో 1.600 కేజీల గంజాయి చాక్లెట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను తీసుకవచ్చిన వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసులను చూసి పరారయ్యాడు. ఎస్టిఎఫ్ పోలీసులు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్టిఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్లలో అక్రమంగా చాక్లెట్ల రూపంలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Sports
వెనక్కి పరిగెత్తి ఒడిసి పట్టిన క్యాచ్‌.. అయ్యర్‌ గాయపాటు |
సిడ్నీ వేదికగా జరిగిన భారత్‌ vs ఆస్ట్రేలియా 3వ వన్డేలో భారత వైస్‌ కెప్టెన్‌...
By Akhil Midde 2025-10-25 09:38:07 0 52
Tripura
Tripura Cancels ‘Happiest Hour’ Bar License Over Violations |
The West Tripura District Administration has revoked the license of the ‘Happiest...
By Pooja Patil 2025-09-16 10:25:27 0 160
Telangana
అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.     అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని...
By Sidhu Maroju 2025-08-08 18:01:56 0 636
Telangana
మెదక్ బావిలో పడి వ్యక్తి మృతి |
మెదక్ జిల్లాలో పండుగ సంబరాల మధ్య విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో విజయదశమి వేడుకల సందర్భంగా, ఓ...
By Bhuvaneswari Shanaga 2025-10-03 11:22:24 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com