సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి

0
88

హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుంది.

గీత దాటితే వేటు తప్పదు: డీజీపీ శివధర్ రెడ్డి.

సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని, సివిల్ వివాదా లను పరిష్కరించిన పోలీసు స్టేషన్ లు,  సంబంధిత అధికా రులపై తక్షణమే వేటు పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ ఎవరూ సివిల్ వివాదాల్లో తల దూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులనుద్దేశించి రాసిన అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయన్న సంగతి ప్రతి పోలీసుకూ తెలుసునని, అయినా వాటిపై దృష్టి సారించే అధికారు లపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదన్న డీజీపీ. అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని చెప్పారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com