కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
50

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు గురువారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, కార్మికుల సంక్షేమం,హక్కుల కోసం పనిచేసి కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.కార్మికులకు, సంస్థలకు వారధిగా యూనియన్లు పనిచేయాలని,వారి సంక్షేమమే పరమావధిగా,వారి హక్కుల సాధన కోసం సంస్థలతో మంచి సంబంధాలు నెలకొల్పకోవాలని,సంస్థల అభివృద్ధికి కూడా తోడ్పాటు అందించాలని కోరారు.ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసిన వారిలో యూనియన్ ప్రెసిడెంట్ దేవకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రతన్ సింగ్, ట్రెజరర్ శ్యాం రావు, వైస్ ప్రెసిడెంట్ లు యాకూబ్, కోటి బాబు, శ్రీనివాస్, హనుమంత్  మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు..

Sidhumaroju 

Search
Categories
Read More
Business EDGE
బంగారం తగ్గినా డిమాండ్ పెరిగిన పండుగ వేళ |
పండుగ సీజన్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా, వినియోగదారుల డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా...
By Deepika Doku 2025-10-10 08:03:22 0 50
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 655
Telangana
తెలంగాణ పోలీసుల నిఘా పెంపు: సైబర్ నేరాలకు చెక్ |
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి మరింత కఠిన చర్యలు చేపట్టారు. నిత్యం సైబర్...
By Bhuvaneswari Shanaga 2025-09-26 06:55:25 0 37
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com