జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

0
228

గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా 

ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :- జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు మరి జర్నలిస్టు జేఏసీ స్వపరి పాలన కొరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత దేశ స్వాతంత్ర్యం సాధనలో కీలక పాత్ర పోషించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని స్మరించుకోవాలని గూడూరు జర్నలిస్టు జేఏసీ మండల అధ్యక్షుడు దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడు శరత్ బాబు సూచించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గాంధీజీ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమాలు వంటి సామూహిక ప్రచారాల ద్వారా స్వపరిపాలన కోసం గాంధీజీ అనేక పోరాటాలను జరిపారన్నారు. సత్యం అహింస మార్గాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశం స్వాతంత్రం సాధనలో విశేష కృషినిఆయన.అందించారన్నారు. గాంధీజీ జయంతిని అంతర్జాతీయ అహింస దినోత్సవం గా భారతదేశం ప్రజలు జరుపుకుంటారన్నారు. అనంతరం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు రోడ్డులోని బాలాజీ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు డాక్టర్ శ్రీరాములు చేతుల మీదుగా బ్రెడ్డు, పండ్లను జర్నలిస్టు జేఏసీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ మండల ప్రధాన కార్య దర్శులు గిడ్డయ్య( ఆంధ్ర ప్రభ ), కిరణ్ (పల్లె వాణి),, సభ్యులు ప్రభాకర్(ప్రజాశక్తి ),మహబూబ్ బాషా.భారత్ అవాజ్. (అంకురం),...అబ్దుల్ లతీఫ్ (విన్నపం), షేక్షావలి (ఆంధ్ర అక్షర), మిన్నెల ( ఐ న్యూస్), ఇస్మాయిల్ (పబ్లిక్ వాయిస్ ),ఇసాక్(కందనవోలు) రాజేంద్రప్రసాద్ (తెలుగు ప్రభ), పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా? మనమంతా జైలు అనగానే తప్పు...
By Bharat Aawaz 2025-08-20 10:25:57 0 603
Rajasthan
Rajasthan Govt Transfers 222 RAS Officers in Major Shuffle |
The Rajasthan government has carried out a major administrative reshuffle, transferring 222...
By Pooja Patil 2025-09-15 12:16:52 0 292
West Bengal
Kolkata Metro suspends services in Howrah Maidan-Esplanade stretch today | Here's why
Kolkata Metro Suspends Howrah Maidan–Esplanade Services for Urgent Maintenance; Purple Line...
By BMA ADMIN 2025-05-19 18:16:22 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com