బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని

0
96

సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక స్థలమేనని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ స్మశానవాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకొని బహులంతస్తుల భవనం నిర్మాణము చేస్తున్నారని కుర్మసంఘం నాయకులు వివిధ రకాలుగా నిరసనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వీరికి అండగా మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆందోళన కారులు సైతం వీరికి అండగా నిలవడం, వారితో కలిసి పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ నేపద్యంలో ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలం కచ్చితంగా కుర్మ సంఘవారికి చెందిన స్మశాన వాటిక అని తెలిపారు. ఈ స్థలం తమ స్వాదినంలోకి తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. కోర్టులో వివాదం ముగిసిన వెంటనే స్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్ని కల్పించి అప్పగిస్తానని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను హెచ్చరించారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 21.... |
తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల దాఖలుకు చివరి...
By Bhuvaneswari Shanaga 2025-10-08 12:09:58 0 25
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ సేవలకు భారీ చేయూత: కేంద్రం నుండి ₹166 కోట్లు |
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి (AYUSH) సేవలను మరింత...
By Meghana Kallam 2025-10-11 09:46:35 0 74
BMA
“What Does Journalism With Purpose Mean Today?”
“What Does Journalism With Purpose Mean Today?” In today’s age of reels,...
By Media Academy 2025-05-04 09:02:00 0 4K
Nagaland
GST Cut on 375 Items to Lower Prices |
Starting today, GST rates have been reduced on 375 essential and daily-use items, bringing relief...
By Bhuvaneswari Shanaga 2025-09-22 04:49:55 0 48
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలపై 75% ప్రజల సంతృప్తి: RTGS సర్వే |
ఆంధ్రప్రదేశ్‌లో రియల్‌టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) నిర్వహించిన రాష్ట్రవ్యాప్త సర్వేలో...
By Akhil Midde 2025-10-23 04:48:01 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com