మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష

0
221

 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తన క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.  ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి పైపులైన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌకూర్ గృహకల్పలో మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి ఆలోకేషన్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.  కౌకూర్ జనప్రియ ఆర్కేడ్ విషయానికి సంబంధించి, అవసరమైన అండర్టేకింగ్ లెటర్ ( అఫిడవిట్‌)ను తీసుకుని, జలమండలి ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.  అలాగే, మచ్చ బొల్లారం ప్రాంతంలోని ఏడు కాలనీలకు ట్రంక్ మెయిన్ ఏర్పాటు పనులను 50:50 నిష్పత్తిలో పూర్తి చేయాలని సూచించారు. పంచశీల కాలనీలో త్రాగునీటి సరఫరా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.  ఇంకా, బోర్ వెల్స్‌కు సంబంధించిన మీటర్ల అనుసంధానం కోసం జిహెచ్ఎంసి మరియు జలమండలి అధికారుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మల్కాజ్గిరి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను మంజూరు చేసేందుకు తాను ముమ్మరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో జలమండలి మేనేజర్ సునీల్, డీజీఎం లు సాంబయ్య, రాజు, మేనేజర్లు మల్లికార్జున్, సృజయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Telangana
లొయోలా అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1976లో స్థాపించబడిన లొయోలా అకాడమీ తరువాత, తన 49 ఏళ్ల విశిష్ట...
By Sidhu Maroju 2025-11-08 15:32:08 0 81
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Tripura
Tripura Builds 443 Earthen Check Dams to Boost Water Conservation
Since 2022, Tripura has constructed 443 earthen check dams under the...
By Pooja Patil 2025-09-13 11:04:51 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com