షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.

0
459

హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నెలవయ్యింది. వివరాలలోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడ్ని నెలకొల్పి వారం రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలోనే కృత్రిమ కొలను, షవర్ ను ఏర్పాటు చేసి అందులోనే ఎటువంటి హంగు ఆర్భాటాలు, డీజేలు, బ్యాండ్ మోతలు లేకుండా నిరాడంబరంగా ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేశారు. గణపతి మహారాజ్ కృత్రిమ కొలనులోనే షవర్ బాత్ చేస్తూ అందులో కరిగి పోతుండగా మహిళా ఉద్యోగులు, కార్మికులు కోలాటాలు ఆడుతూ వీడ్కోలు పలికారు.

      Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ :మే 10 ప్రధాని నరేంద్ర మోధి రక
దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ...
By Sadaq Sadaq 2026-04-29 18:22:05 0 259
Andhra Pradesh
అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-03-16 02:15:45 0 197
SURAKSHA
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
By Lokeshwari Panthadi 2026-07-15 06:07:53 0 211
SURAKSHA
Rajeev Kumar Sharma: Championing Justice with Integrity
The Journey Begins "The badge of an IPS officer is not merely a symbol of...
By Fathima Safa 2026-07-21 08:06:57 0 102
Andhra Pradesh
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ జగన్ సహా వైసీపీ...
By Pagadala Venkateswar 2026-08-17 05:57:00 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com