రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.

0
231

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్ ఫిన్ వెస్ట్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఐదు శాఖలను సంస్థ సీఎండీ అడ్వకేట్ జార్జ్ జాన్ వాలత్ గారితో కలిసి తెలంగాణ శాసనమండలి సభ్యులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి, మరియు మల్కాజిగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా అల్వాల్ ల్లో ఘనంగా ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగల రాజేందర్,నర్సంపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ పళ్ళాయి శ్రీనివాస్, మహబూబాబాద్ లో జిల్లా కేంద్రంలో వార్డు కౌన్సిలర్ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల మహేష్ చేతుల మీదుగా మరియు హైదరాబాదు నగరంలో బాలా నగర్ బ్రాంచ్ ను స్థానిక జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జ్వాలి సేల్స్ నేషనల్ హెడ్ ప్రవీణ్ ట్రైనింగ్ సెక్షన్ హెడ్ ప్రమోద్ కుమార్ సేల్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ రీజినల్ మేనేజర్ జి ఉపేందర్ ఏరియా మేనేజర్ తిరుపతి క్లస్టర్ మేనేజర్లు మహేందర్ కళ్యాణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కేరళలో దాదాపుగా 100 బ్రాంచీలు దేశవ్యాప్తంగా 150 శాఖలను కలిగి అతి తక్కువ సమయంలో దేశంలోనే అత్యంత వేగంగా అతి గొప్ప సంస్థగా మ్యాక్స్ గోల్డ్ లోన్ సంస్థ మరిన్ని శాఖలను విస్తరించాలని ఈ సందర్భంగా సంస్థ సీఎం డి జార్జ్ జాన్ వాలెత్ను అభినందించారు మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 100 శాఖలు విస్తరించి వెయ్యి మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ తమ సంస్థ దేశంలో 1000 బ్రాంచీలను విస్తరించి 2030 నాటికి విచ్ మ్యాచ్ గోల్డ్ లోన్ కంపెనీ మరియు ఇతర ఏడు విభాగాలను కలిపి రిచ్ మ్యాచ్ ప్రైవేటు బ్యాంకుగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జార్జి పేర్కొన్నారు. అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్ బాలానగర్ బ్రాంచ్ మేనేజర్ కిరణ్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ జక్కుల రమేష్ ఇల్లందు బ్రాంచ్ మేనేజర్ బొడ్డు సురేందర్ నాయకులు మల్లికార్జున్,ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రిచ్ మాక్స్ ఏరియా మేనేజర్ ఆశీస్సులు మిత్ర గారు, క్లస్టర్ మేనేజర్ రితేష్ తదితరులు పాల్గొన్నారు...

    SIDHUMAROJU 

Search
Categories
Read More
Telangana
వడ్ల నిల్వకు గోదాముల కొరత.. కేంద్రం స్పందించలేదే |
తెలంగాణలో వడ్ల కొనుగోలు సీజన్ ప్రారంభమైన వేళ, గోదాముల కొరత రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:55:22 0 30
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 2K
Sports
పాక్‌ ఔట్‌.. IND-W జట్టు ఫైనల్‌కు దూసుకెళ్తోంది |
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 లీగ్‌ దశ ముగిసింది. భారత్‌ మహిళల జట్టు...
By Bhuvaneswari Shanaga 2025-10-22 04:21:09 0 36
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com