నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.

0
391

హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు సమర్పిస్తూ...

"నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి.  టంగుటూరి ప్రకాశం రెండో కుమారుడు హనుమంతరావు ! 

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు ని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 

చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం  కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు వారి నివాసానికి చేరుకున్నారు ! 

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు, తుర్లపాటి కుటుంబరావు  దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు  నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 

ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు  స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 

ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ? 

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 

ఆ తరం వేరు 

నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు !

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

  - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మెరిసిన ఆణిముత్యం. డాక్టర్ కే తనూజ. ఇటీవల నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో కర్నూల్ మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్ కుశినేని తనూజ ప్రతిభను కనపరిచారు.
కర్నూలు జిల్లా, మండల కేంద్రమైన గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుసినేని గిడ్డయ్య,...
By mahaboob basha 2025-08-21 10:49:53 0 466
Telangana
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి...
By Vadla Egonda 2025-06-10 08:41:31 0 1K
Andhra Pradesh
'Palleku Podam' Initiative | 'పల్లెలకు పోదాం' కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో 'పల్లెలకు పోదాం' కార్యక్రమం ద్వారా అధికారులు నేరుగా గ్రామ ప్రజలతో ముఖాముఖీ...
By Rahul Pashikanti 2025-09-10 11:29:53 0 41
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Telangana
Jagruthi Revolt | జాగృతి తిరుగుబాటు
బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎంపీ కవితకు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణ...
By Rahul Pashikanti 2025-09-10 05:36:41 0 16
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com