అల్వాల్ చెరువు కట్ట పైన లైట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు.

0
434

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కట్టపై రహదారి పరిస్థితి రోజు రోజుకీ అధ్వాన్నంగా మారుతోంది. రోడ్లంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. చీకటిలో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. చెరువు కట్ట రహదారి అల్వాల్ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యమైన రహదారి అయినప్పటికీ అభివృద్ధి పనులు జరగకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్యను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే రోడ్లను మరమ్మతు చేసి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని అల్వాల్ ప్రజలు కోరుతున్నారు.  ప్రజల భద్రత కోసం సంబంధిత అధికారులూ, GHMC తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

    - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కథలోని నీతి
నిజంగా ఈ కధలో నీతిని గ్రహించాలంటే రెండు విషయాలపై ద్రుష్టి పెట్టాలి :- 1) వరదలో చిక్కుకున్న...
By Vadla Egonda 2025-06-18 14:00:25 0 1K
Technology
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్‌పై దర్యాప్తు షురూ |
అమెరికా ట్రాఫిక్ భద్రతా సంస్థ NHTSA తాజాగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సాంకేతికతపై దర్యాప్తు...
By Bhuvaneswari Shanaga 2025-10-10 12:13:10 0 33
Andhra Pradesh
చిరు వ్యాపారులకు చంద్రబాబు నూతన ఆశల బాట |
నెల్లూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వసముద్ర బయో...
By Bhuvaneswari Shanaga 2025-10-10 05:14:42 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com