జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయండి*

0
452

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి

- జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్

*కర్నూలు, ఆగస్టు 18:*

జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్ వెంకట సుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారులు వైవీ క్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరారు. సోమవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2009 లో జగన్నాథ గట్టుపైన జర్నలిస్టులకు ఎకరా రూ.4 లక్షల 15.44 ఎకరాలు మార్కెట్ విలువ ప్రకారం కర్నూలు జిల్లా జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ కి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో సొసైటీ నిర్వాహకులు 258 మంది జర్నలిస్టులకు 3.50 సెంట్ల ప్రకారం ప్లాట్లు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే జర్నలిస్టుల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఏర్పాటు చేసుకోవడానికి లింక్ రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం లేదన్నారు. దీంతో ఇన్నేళ్లు గడిచినా ఇళ్ళు నిర్మించలేని పరిస్థితి ఉందన్నారు. ఇళ్ళు నిర్మించలేదని గతంలోనున్న కలెక్టర్ జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలను కొట్టివేయడం జరిగిందన్నారు. అయినా ఆన్లైన్ లో జర్నలిస్టుల ఇంటి స్థలాలను మార్చి ప్రభుత్వ భూమిగా చేర్చడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి జగన్నాథగట్టు జర్నలిస్టు స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే చాలా మంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవని, అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అన్ని పరిశీలించి తప్పకుండా జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు సుధాకర్, రఫీ, అంజి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 193
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 449
Andhra Pradesh
ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తాత్కాలికంగా మూత |
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది సెప్టెంబర్ 27 వరకు మూతపడాయి....
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:15:26 0 113
Telangana
BC కోటాకు న్యాయ బలం.. కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం |
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం BC కోటా చట్టబద్ధమని సుప్రీం కోర్టు తీర్పు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 10:57:20 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com