అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

0
450

 

 

 

 

 

 

 

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్.  బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజా యోధుడు, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు అల్వాల్‌లో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వేమూరి సాయిరాం గౌడ్‌తో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజల జీవితాలను వెలుగులోకి తెచ్చే కృషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణ గౌడ్, లక్ష్మీకాంతరెడ్డి, సూర్య కిరణ్, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు గౌడ్, సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఇక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా పాపన్న గౌడ్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్, కార్తీక్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, రవికిరణ్, ముయ్యి సుజాత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

     - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
స్థానిక వసూళ్లలో ₹3.4 కోట్ల ఆదాయం నమోదు |
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో స్థానిక వసూళ్ల ద్వారా ₹3.4 కోట్ల ఆదాయం నమోదైంది....
By Bhuvaneswari Shanaga 2025-10-01 11:44:45 0 43
Andhra Pradesh
ఏపీ మహిళల రక్షణకు కొత్త వేదిక: ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం |
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కారానికి కొత్త ఆన్‌లైన్...
By Meghana Kallam 2025-10-11 06:46:11 0 69
Telangana
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ వద్దు: ప్రభుత్వ విద్యను కాపాడండి |
ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలల' విధానాన్ని ఉపసంహరించుకోవాలని "విద్యను కాపాడండి...
By Bhuvaneswari Shanaga 2025-09-26 07:11:41 0 40
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com