అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

0
449

 

 

 

 

 

 

 

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్.  బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజా యోధుడు, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు అల్వాల్‌లో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వేమూరి సాయిరాం గౌడ్‌తో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజల జీవితాలను వెలుగులోకి తెచ్చే కృషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణ గౌడ్, లక్ష్మీకాంతరెడ్డి, సూర్య కిరణ్, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు గౌడ్, సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఇక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా పాపన్న గౌడ్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్, కార్తీక్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, రవికిరణ్, ముయ్యి సుజాత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

     - sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
Mysuru Dasara 2025 Kicks Off with Grand Inauguration |
The Mysuru Dasara festival 2025 has officially begun with an elaborate inauguration attended by...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:31:49 0 44
Telangana
నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
     హైదరాబాద్/ గోషామహల్.   ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక...
By Sidhu Maroju 2025-07-20 13:59:32 0 857
Himachal Pradesh
हिमाचल में मूसलधार बारिश से जनजीवन प्रभावित भारी आर्थिक नुकसान
हिमाचल प्रदेश में #मूसलधार_बारिश के कारण जनजीवन गंभीर रूप से प्रभावित हुआ है। राज्य आपदा प्रबंधन...
By Pooja Patil 2025-09-13 07:08:31 0 69
Gujarat
గుజరాత్‌లో వరదలతో నష్టపోయిన రైతులకు ఊరట |
గుజరాత్ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు...
By Deepika Doku 2025-10-21 05:00:16 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com