బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
474

 

 

మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం ఈరోజు బోయిన్ పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడని,మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని,350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని, జమిందారులు, భూస్వాములపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని,ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు.ఈ జయంతి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

      -sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పౌర సేవల్లో విప్లవం: వాట్సాప్‌లో ఆదాయ, కుల ధృవీకరణ |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఇకపై ఆదాయ, కుల...
By Bhuvaneswari Shanaga 2025-09-26 11:33:45 0 45
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 2K
Telangana
తెలుగు సినీ పరిశ్రమకు పోలీసుల మద్దతు |
తెలుగు సినీ పరిశ్రమను రక్షించేందుకు హైదరాబాద్ పోలీసు శాఖ కీలకంగా ముందుకొచ్చింది. పైరసీపై...
By Bhuvaneswari Shanaga 2025-09-30 06:11:17 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com