వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు

0
656

మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.

 

 జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ – దినకర్ నగర్, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 15లో కాలనీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రధాన సమస్యలు.

సాయంత్రం కాగానే మందుబాబులు రోడ్డుపైన కూర్చొని సిగరెట్, మద్యం తాగడం వల్ల కాలనీలో రాకపోకలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది.రోడ్డుపై మూత్ర విసర్జన, చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోంది.ఆవులు, జంతువులు చెత్తలో తిరగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం. వర్షాకాలంలో దోమలు, చీమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి, చెత్తను తొలగించడంతో పాటు ప్రతి రోజు శుభ్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే, ఈ ప్రదేశంలో ప్రత్యేక డంపింగ్ బిన్ ఏర్పాటు చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
BMA
The Power of Alternative Media: A People’s Movement
The Power of Alternative Media: A People’s Movement From pamphlets during the freedom...
By Media Facts & History 2025-04-28 13:23:52 0 2K
Delhi - NCR
వాయు కాలుష్యంతో ఢిల్లీ శ్వాస ఆపేసిన రోజు |
దీపావళి పండుగ అనంతరం ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర...
By Deepika Doku 2025-10-21 04:24:33 0 57
Andhra Pradesh
పంట ధరల స్థిరీకరణకు కోల్డ్ చైన్ ప్రణాళిక |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో కోల్డ్ చైన్ మౌలిక...
By Deepika Doku 2025-10-10 06:44:37 0 47
Andhra Pradesh
ఆటో డ్రైవర్లు, మహిళల ప్రయాణంపై కీలక సమావేశం |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య విజయవాడలో జరిగిన...
By Bhuvaneswari Shanaga 2025-09-29 12:36:55 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com