ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

0
821

సికింద్రాబాద్/అడ్డగుట్ట

 

సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు అడ్డగుట్ట లోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెంకట్ మంచి నటుడు అని, అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ని అందరికి నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Maharashtra
Ethanol Lifeline Relief or Risk for Sugar Mills
Union Minister Nitin Gadkari said #ethanol production has become a lifeline for sugarcane farmers...
By Pooja Patil 2025-09-15 04:29:33 0 58
Andhra Pradesh
కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో పవన్ సమీక్ష |
నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతోంది. ఉదయం కాకినాడ...
By Bhuvaneswari Shanaga 2025-10-09 06:49:48 0 30
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Telangana
మెగాస్టార్ హక్కులకు కోర్టు రక్షణ ఉత్తర్వులు |
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిగత...
By Akhil Midde 2025-10-25 12:08:57 0 49
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com