ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్

0
108

 

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి సర్కిల్ లోని ప్రజా వాణి మరియు, జి. హెచ్. ఎం. సి ప్రధాన కార్యాలయం లోని ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం చెప్పట్టిన సమగ్ర సర్వే లో పాల్గొన్న ఆశ వర్కర్లకు ఇప్పటి వరకు 10,000/- డబ్బు చెల్లించకపోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.  వెంటనే వారికీ బకాయిలు చెల్లించాలని డిప్యూటీ కమీషనర్ సుల్తానా,  మరియు ఎలక్షన్స్ సెల్ అడిషనల్ కమీషనర్ మగతయారు  కోరగా, అందరి వివరాలు అధికారులు తీసుకోవడం జరిగింది.అదే విధంగా పలు ప్రదేశాలు పార్కుల క్రింద అభివృధి చెయ్యాలని కోరామని కానీ టౌన్ ప్లానింగ్ వారి సహకారం లేకపోవడం వల్ల అభివృధి పనులు ఆగిపోయాయని అన్నారు.  వెంటనే సంబంధిత శాఖలకు కావాల్సిన అనుమతులు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ వారిని కోరారు.  ఈ కార్యక్రమం లో సంజీవ్, సంతోష్, ఆశ వర్కర్లు హేమలత,వసంత, జయశ్రీ, సుల్తానా, లక్ష్మి మరియు పెద్ద ఎత్తున ప్రజలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

#sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com