బోయిన్ పల్లి 6వ వార్డు లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటన

0
351

 

మేడ్చల్ మల్కాజిగిరి / కంటోన్మెంట్.

నిన్న కురిసిన భారీ వర్షానికి బోయిన్ పల్లి వార్డు 6 లోని మర్రి రాంరెడ్డి కాలనీలో ఉన్న నాలా చిన్నదిగా ఉండడంతో సీతారామ పురం,భారతీ ఎవెన్యూ, రామన్న కుంట చెరువు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ వర్షపు నీరు బయటకు పంపే విధంగా, వర్షపు నీటితో వచ్చిన బురదను బయటకు ఎత్తిపోసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆ ప్రాంతాలను సందర్శించి పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు 10 ఏళ్లుగా ఈ సమస్యలను పట్టించుకోక పోవడంతో ప్రజలకు ఈ దుస్థితి వచ్చిందని,ఎన్నో ఏళ్ల నుంచి అధికారం వెలగబెట్టిన వారు ఎందుకు ఈ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టడంతో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన భూములను తీసుకుని దాని పరిహారం కింద 303 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ఆ నిధులు కంటోన్మెంట్ బోర్డుకే చెందే విధంగా జీవో ఇప్పించి ఆ నిధులు బోర్డుకు వచ్చే విధంగా కృషి చేశారని, ఈ ప్రాంత ఎంపీగా కూడా పనిచేసిన రేవంత్ రెడ్డి ఈ ప్రాంత సమస్యలు తెలిసి ఉండడంతో కంటోన్మెంట్ బోర్డు కు నిధులు లేవనే విషయం కూడా తెలిసినందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు చెల్లించాల్సిన 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ బోర్డుకి వచ్చే విధంగా కృషి చేశారని,  వచ్చిన 303 కోట్ల నిధులతో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నాలాలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు అభివృద్ధి చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా తీవ్రంగా కంటోన్మెంట్ బోర్డు పై ఒత్తిడి తీసుకు వస్తున్నానని  తెలిపారు. ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డ్ మాజీ వాయిస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్ శ్యామ్యూల్ లికేష్,భాగ్యా రెడ్డి స్థానిక నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు బంపర్ ఆఫర్ |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 13,500 మంది మహిళా...
By Bhuvaneswari Shanaga 2025-10-01 10:04:18 0 41
Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కీలక చర్చలు |
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేడు ఉదయం 10 గంటలకు కీలక...
By Bhuvaneswari Shanaga 2025-10-10 06:12:40 0 96
Telangana
వర్షాలు, గాలులు: వాతావరణ శాఖ హెచ్చరిక |
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో తుఫానాలు, మెరుపులు, గాలివానలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ...
By Bhuvaneswari Shanaga 2025-10-01 12:12:57 0 43
Telangana
అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి...
By Sidhu Maroju 2025-10-08 02:26:56 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com