విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ సంస్కరణలకు, స్మార్ట్ మీటర్ల వ్యతరేకంగా పోరాడుతాం,

0
328

సిపిఎం)కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యుత్ సంస్కరణలకు, స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా పోరాడుతామని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి 

 జే ,మోహన్ అన్నారు,విద్యుత్ పోరాట అమర వీరుల సంస్కరణ సభ సందర్భంగా విద్యుత్ సంస్కరణలకు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, సర్ చార్జీల పేరుతో అధిక వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడుతామని గూడూరు బస్టాండ్ లో సిపిఎం పార్టీ ఆధ్వరంలో సిపిఎం నాయకులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి 

జే ,మోహన్ మాట్లాడుతూ.... 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన నాటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను చేసి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తే, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ బషీరాబాద్ లో వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో ముగ్గురు(రామకృష్ణ,బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి,) మరణించారని, నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిందని,, చనిపోయిన వారి పోరాట వలన 20 సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యుత్ సంస్కరణలు చేయడానికి సాహసించలేదని,, గత వైసిపి ప్రభుత్వం సర్చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు, ఇలా రకరకాల చార్జీల పేరుతో ప్రజలపై అధిక విద్యుత్ భారాలు వేసి వసూలు చేసిందని,, ఈ విద్యుత్ బారాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీంతోపాటు అదాని కంపెనీతో ఒప్పందం చేసుకొని విద్యుత్తును అదాని కంపెనీకి ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నదని, అందులో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నాలు చేసిందని, అందుకే ప్రజలు వైసిపి ప్రభుత్వం ఇంటికి పంపించిందని, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్ సర్చార్జిలను తగ్గిస్తుందేమోనని ఆశపడ్డ ప్రజలకు అడియాశలే మిగిల్చిందని, ఈ కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్తును అదాని కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇండ్లకు బిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రభుత్వాలు మారిన ప్రజలపై విద్యుత్ ద్వారాలు మాత్రం తగ్గడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలం తగ్గించి స్మార్ట్ మీటర్లను రద్దు చేయకపోతే 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన అమరవీరుల పోరాట స్ఫూర్తితో సిపిఎం పార్టీగా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు,,,కార్యక్రమంలో సిపిఎం నాయకులు దానమన్న, కొమ్మురాజు, కృప, నాగేష్, సురేష్, చిన్న రాజు, హమాలి సంఘం నాయకులు చిరంజీవి, పెద్ద సుధాకర్, ప్రభుదాస్, ఏసేపు, అబ్రహం, చిన్న సుధాకర్, సురేష్, కోళ్ల రవి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు,,

Search
Categories
Read More
Goa
Rotary Rain Run in Goa Gathers Momentum Amid Monsoon
The annual Rotary Rain Run held in Panaji is growing in popularity each year. Strategically timed...
By Bharat Aawaz 2025-07-17 06:18:58 0 2K
Punjab
ਮੁੱਖ ਮੰਤਰੀ ਭਗਵੰਤ ਮਾਨ ਅੱਜ ਹਸਪਤਾਲ ਤੋਂ ਛੁੱਟੀ ਹੋ ਸਕਦੇ ਹਨ
ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ #ਭਗਵੰਤ_ਮਾਨ ਦੀ ਸਿਹਤ ਸੰਬੰਧੀ ਹਾਲਾਤ ਸੰਤੋਸ਼ਜਨਕ ਹੈ। ਅੱਜ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਸਪਤਾਲ ਤੋਂ...
By Pooja Patil 2025-09-11 10:13:35 0 96
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 1K
Goa
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers Due to ongoing heavy rainfall...
By BMA ADMIN 2025-05-21 08:48:30 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com