ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు

0
916

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం దేవాలయములకు ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు అతిథులకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఆ తరువాత జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయం లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ మొదయింది. వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈ ఘర్షణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. వెంటనే పోలీస్ లు ఇరువర్గాలను తమ అదుపులోకి తీసుకొని వారికి రక్షణ కలిగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకున్నారు. ఉద్రిక్తల వలన ఆగిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు కొనసాగించారు.

Search
Categories
Read More
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 1K
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 2K
Telangana
తాళాలు, కాలువల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం |
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నీటి వినియోగ సంఘాలు (WUAs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ...
By Bhuvaneswari Shanaga 2025-09-30 04:48:29 0 29
BMA
BMA - Beyond A Network - A Movement
At Bharat Media Association (BMA), Our Vision Goes Far Beyond Building A Simple Network. It Is A...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:53:25 0 2K
Andhra Pradesh
తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్: భారీ వర్ష సూచన |
భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబర్ 24, 2025 న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పసుపు (Yellow)...
By Akhil Midde 2025-10-24 03:50:51 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com