Bharat Aawaz

బోధన్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి: ఎంఐఎం నేతల డిమాండ్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
127
Views

అక్టోబర్ నెలాఖరులోగా రహదారి పనులను తిరిగి ప్రారంభించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బోధన్‌తో పాటు ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

వర్ణి రోడ్డు పనులు కొనసాగుతుండగా, బోధన్ రోడ్డు పనులు నిలిపివేయడం ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంపై ఉద్దేశపూర్వక వివక్ష చూపుతున్నట్లుగా ఉందని ఓ నాయకుడు ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ (ఈఈ) అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కార్యాలయంలో ఎంఐఎం నాయకులు, ఈఈ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం రహదారి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఎస్‌ఈ నాయకులకు హామీ ఇచ్చారు. అయితే పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.