Bharat Aawaz

92 వార్డు పద్మనాభ నగర్‌లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు గారు

Santhosh Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
209
Views

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 92వ వార్డు, పద్మనాభనగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలను (ఓపెన్ జిమ్) ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. జీవీఎంసీ నిధులు రూ. 9.98 లక్షల అంచనా వ్యయంతో స్థానికుల సౌకర్యార్థం ఈ ఓపెన్ జిమ్‌ను అత్యాధునిక కసరత్తు పరికరాలతో అందుబాటులోకి తీసుకువచ్చారు.

 ఈ సందర్భంగా శ్రీ గణబాబు గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఆరోగ్యం అత్యంత కీలకమైనదని, ప్రజల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే వార్డుల్లో ఇలాంటి ఓపెన్ జిమ్‌లను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాలనీలోని యువత, మహిళలు మరియు వయోవృద్ధులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ వ్యాయామశాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, పార్కులు, వ్యాయామశాలల అభివృద్ధికి తమ వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.