శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్

0
1K

మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ..

ఈ ఆషాఢ మాసంలో లో జరిగే బోనాల పండుగ సందర్భంగా.. గోల్కొండ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి తొలి బోనం ను అమ్మవారికి సమర్పిస్తారు.  హైదరాబాద్ లో లష్కర్ బోనాల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీతో ఆషాఢం శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో బోనం అమ్మవారికి సమర్పించుకుని తల్లికి పూజలు నిర్వహించి పిల్లలు, కుటుంబం, రాష్ట్రం చల్లగా ఉండేలా పాడి పంటలతో ఏ కష్టాలు లేకుండా జీవించే భాగ్యం కలగాలని ఆనాదిగా ప్రతి సంవత్సరం బోనాల పండుగను నిర్వహించుకుంటున్నాము. బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని.. జాతరను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ సోదరులందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.

Search
Categories
Read More
Telangana
నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం
*నేతన్నలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్* తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది....
By Vadla Egonda 2025-07-02 06:11:07 0 1K
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com