అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు

0
219

ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎ కె బాష గారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి 58 రోజులపటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని మద్రాసులో మన తెలుగు వారు పడుతున్న కష్టాలను చూసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడదీయాలని ఉద్యమాన్ని చేపట్టి మన తెలుగువారి కోసం ఆయన సుఖ సంతోషాలను వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టి తెలుగుజాతి గౌరవం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారు అని, 1952 లో ఆయన చేసిన దీక్ష భారత దేశ చరిత్రను మార్చిందని ఆయన త్యాగ ఫలితంగానే 19503 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి గవర్నింగ్ బాడీ సీనియర్ జూనియర్ న్యాయవాదుల హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Shimla Traffic Overhaul
Shimla Police have launched a massive traffic management plan to tackle the intense summer...
By Dunna Jessicaruth 2026-05-25 05:55:30 0 107
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 228
Andhra Pradesh
పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ
జై వాసవీ !!! జై   "" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ" ఎన్టీఆర్ జిల్లా...
By Patan Khuddus 2026-05-01 17:15:11 0 298
Andhra Pradesh
ముగతి గ్రామం పశువుల దాన సంచులు
నందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు...
By Boya Dasthagiri 2026-09-21 04:19:28 0 29
Andhra Pradesh
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు
విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి...
By Boiena Rajesh 2026-02-25 14:39:53 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com