Bharat Aawaz

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సమిష్టి కృషితో అద్భుత వేడుకలు

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
130
Views

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతే పరమాత్మగా భావించే తెలంగాణ మహోన్నత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు రూపం. గునుగు, తంగేడు, చామంతి, గుమ్మడి పూలతో ప్రకృతిని పూజించే ఈ విశిష్ట పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ సంబరాల్లో పట్టణ మహిళలు, ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలను విజయవంతం చేయడానికి మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాశ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వార్డు కౌన్సిలర్లు మరియు వార్డు ఆఫీసర్లు ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఉండి, క్షేత్రస్థాయిలో స్వయంగా దగ్గరుండి అన్ని పనులను పూర్తి చేయించారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక సహకారంతో పట్టణంలో విద్యుత్ దీపాల అలంకరణ, మైక్ సెట్టింగులు, తాగునీరు మరియు నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని వసతులను అత్యుత్తమంగా ఏర్పాటు చేయించారు.

దీంతో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను కొలుస్తూ సాంప్రదాయ ఆటపాటలతో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. రాత్రి వేళలో విద్యుత్ వెలుగుల జిలుగుల మధ్య భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడి, అనంతరం నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు వార్డు అధికారులు మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాత్రి వేళలో విద్యుత్ వెలుగుల మధ్య మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడిన అనంతరం, నిమజ్జన ఘాట్ల వద్దకు చేరుకుని, మహిళలు ‘పోయిరావమ్మ బతుకమ్మ. సాగిపోవమ్మ గౌరమ్మ’ అంటూ భక్తిభావంతో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.