కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియామకం. ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ కాంబ్లె అనిల్ ఘన సన్మానం

0
163

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపిపి బొమ్మన బాలేష్ గౌడ్ గార్లు ఎండీ ఆసిఫ్ అలీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీకి NSUI వెన్నెముక లాంటిదని, రాహుల్ గాంధీ గారి ఆశయాలతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్‌ గారితో భేటీ: నూతన NSUI జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ అలీ కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుని, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఆసిఫ్ అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
*"స్థానిక ఎన్నికల్లో గెలుపు మనదే కావాలి..- కాకాణి"* గోవర్ధన్ రెడ్డి ` ఉదయగిరి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాలరెడ్డి గారు రాజ్య సభ సభ్యులు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారి చేతులు మీదగా id కార్డు అందుకుంటున్న దృశ్యం.
*SPSR నెల్లూరు జిల్లా*  *తేదీ 10.09.2026*   *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,...
By VALLERU SIMHADRI 2026-09-10 15:56:16 0 200
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 84
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 13:53:48 0 93
Andhra Pradesh
ఇంస్టాగ్రామ్ చింతల మధు మాట్లాడుతూ
చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ...
By Boya Dasthagiri 2026-08-12 08:34:06 0 173
Telangana
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష   రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
By Pinnehasan Odela 2026-04-08 13:24:27 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com