కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియామకం. ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ కాంబ్లె అనిల్ ఘన సన్మానం

0
164

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపిపి బొమ్మన బాలేష్ గౌడ్ గార్లు ఎండీ ఆసిఫ్ అలీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీకి NSUI వెన్నెముక లాంటిదని, రాహుల్ గాంధీ గారి ఆశయాలతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్‌ గారితో భేటీ: నూతన NSUI జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ అలీ కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుని, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఆసిఫ్ అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి...
By Bheeshman King 2026-07-22 13:03:27 0 784
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 2K
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 598
Andhra Pradesh
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు...
By Naveen Kumar 2026-03-30 05:23:22 0 458
Andhra Pradesh
పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం...
By Kothuru Murali 2026-02-17 08:36:08 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com