రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా జరిగింది

0
93

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా స్థాయి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు, జిల్లా నాయకత్వం ఘన స్వాగతం పలికింది.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రి కొల్లు రవీంద్ర గారు ముఖ్య అతిథులుగా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి సమన్వయంతో ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యధిక భాగం అమలు చేశామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం-2, అన్నదాత సుఖీభవ, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, తాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు వివరించారు. అనంతరం జిల్లా పరిధిలోని 29,275 డ్వాక్రా సంఘాలకు రూ.2,975 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో దారుణం
పుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి...
By Kothuru Murali 2026-04-05 07:50:36 0 229
Andhra Pradesh
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు  ఆక్వా, వరి...
By Pagadala Venkateswar 2026-04-30 04:50:08 0 143
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 290
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
By Kothuru Murali 2026-02-23 12:10:00 0 174
SURAKSHA
Sachin Yadav IPS: Inspiring Modern Policing Leadership
AGMUT cadre officer Sachin Yadav has emerged as a dynamic young IPS leader known for disciplined...
By Lokeshwari Panthadi 2026-07-27 12:38:38 0 340
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com